Mane Praveen

Nov 14 2023, 23:00

నల్లగొండ: ఇందిరమ్మ కాలనీలో ప్రచారం నిర్వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ నియోజకవర్గం:

నల్గొండ మున్సిపాలిటీ:

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రచారంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మరియు పలువురు కౌన్సిలర్లు..

నల్గొండ: మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ, వెంకట రమణ కాలనీ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీపీసీసీ స్టార్ క్యాంపైనర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు, నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..

ఇందిరమ్మ కాలనీ లో 120 ఇళ్ల పట్టాలు ఇచ్చిన...

60 పైగా ఇల్లు కట్టిచ్చిన..

ఇక్కడ ఒక కాలనీ ఉంది అని స్థానిక ఎమ్మెల్యే కి తెలియదని విమర్శించారు.

కాలనీ లో రోడ్లు విస్తరిస్తాను..

నీళ్లు ప్రతి రోజు వచ్చేలా చూస్తా..

కౌన్సిలర్ జానయ్య బాగా పని చేస్తాడు..

కుటుంబ పెద్ద కోల్పోయిన రేణుక పిల్లలని చదివిస్తా..అని అన్నారు

ఈ కాలనీలో నివసించే వారు మొత్తం పేద ప్రజలు..

మీ అందరికి మాట ఇస్తున్న నల్గొండ చుట్టుపక్కల నివాసం ఉంటున్న పేద ప్రజలకి ఇల్లు కట్టిస్తా..అని హామీ ఇచ్చారు.

అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డు తో పాటు 9 రకాల సరుకులు ఇస్తాము..

అధికారం వచ్చిన 3 నెలల్లో మీ కాలనీ రూపురేఖలు మారుస్తా..

ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజులు దగ్గరలో ఉన్నాయి.. అందరూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Nov 14 2023, 22:40

TS: రాష్ట్రంలో 72 శాతం మంది ఓటర్లు 49 సం. లోపు వారే..

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 49 ఏండ్ల లోపు ఓటర్లు 72 శాతం ఉన్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా కొత్త ఓటర్లు నమోదయ్యారు.

కొత్త ఓటర్లు, ఓటర్ల వయస్సు, నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య తదితర వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

శేరిలింగంపల్లి లో అత్యధిక ఓటర్లు.. భద్రాచలంలో అత్యల్పం

మేడ్చల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా కొత్త ఓటర్లు

కొత్త ఓటర్లు, ఓటర్ల వయస్సు, నియోజకవర్గాలవారీగా ఓటర్ల సంఖ్య తదితర వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,62,98,418 మంది పురుషులు కాగా, మహిళలు 1,63,01,705 ఉండగా ట్రాన్స్‌జెండర్లు 2,676 మంది ఉన్నారు. ఓటర్లలో 59 ఏండ్లలోపు వారు 86 శాతం ఉన్నట్టు వెల్లడైంది.అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా శేరిలింగంపల్లి (7,32,506) నిలిచింది.

ఆ తరువాత కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 6,99,130 ఓటర్లు ఉన్నారు. అతి తక్కువ సంఖ్యలో భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నారు. ఆ తరువాత అశ్వరావుపేట, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు ఉన్నాయి. 80 ఏండ్లు దాటినవారు 4,40,371, దివ్యాంగులు 5,06,921 మంది ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన 18, 19 సంవత్సరాల వయస్సు వారు 9,99,667 మంది ఉన్నారు. వీరిలో 5,70,274 పురుషులు కాగా మహిళలు 4,29,273 ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 120 మంది ఉన్నారు. కొత్త ఓటర్లు అత్యధిక సంఖ్యలో నమోదైన నియోజకవర్గాలలో కూడా మేడ్చల్‌ (17,012) మొదటిస్థానంలో నిలిచింది.

పురుషులకంటే మహిళలే అత్యధికం

వయస్సుల వారీగా ఓటర్ల వివరాలు

వయస్సు : ఓటర్లు

18-19 : 9,99,667

20-29 : 64,36,335

30-39 : 92,93,392

40-49 : 66,96,089

50-59 : 45,66,306

60-69 : 27,72,128

70-79 : 13,98,511

80+ : 4,40,371

మొత్తం : 3,26,02,799

అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు

నియోజకవర్గం : ఓటర్లు

భద్రాచలం : 1,48,661

అశ్వరావుపేట : 1,55,961

బెల్లంపల్లి : 1,73,335

చెన్నూరు : 1,88,283

వైరా : 1,93,069

బాన్సువాడ : 1,95,191

దుబ్బాక : 1,98,100

పినపాక : 1,98,402

జుక్కల్‌ : 1,99,962

అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు

నియోజకవర్గం : ఓటర్లు

శేరిలింగంపల్లి : 7,32,506

కుత్బుల్లాపూర్‌ : 6,99,130

మేడ్చల్‌ : 6,37,839

ఎల్బీ నగర్‌ : 5,93,712

రాజేంద్రనగర్‌ : 5,81,937

మహేశ్వరం : 5,46,577

ఉప్పల్‌ : 5,29,416

మల్కాజిగిరి : 4,89,043

కూకట్‌పల్లి : 4,63,864

పటాన్‌చెరు : 3,97,237

18, 19 ఏండ్ల వారు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు

నియోజకవర్గం : యువ ఓటర్లు

మేడ్చల్‌ : 17,012

కుత్బుల్లాపూర్‌ : 15,117

రాజేంద్రనగర్‌ : 14,094

మహేశ్వరం : 14,039

ఖమ్మం : 13,599

ఎల్బీనగర్‌ : 12,569

మునుగోడు : 12,523

గద్వాల : 12,385

ఇబ్రహీంపట్నం : 12,757

వనపర్తి : 12,073

80 ఏండ్లు దాటిన వారు అత్యధికంగా ఉన్న సెగ్మెంట్లు

నియోజకవర్గం : ఓటర్లు

మల్కాజిగిరి : 10,128

ఎల్బీనగర్‌ : 8,478

శేరిలింగంపల్లి : 8,102

మలక్‌పేట : 7,871

ఉప్పల్‌ : 7,553

మహేశ్వరం : 7,019

ముషీరాబాద్‌ : 6,780

కంటోన్మెంట్‌ : 6,395

యాకత్‌పుర : 6,201

సనత్‌నగర్‌ : 5,931

దివ్యాంగులు అధికంగా ఉన్న నియోజకవర్గాలు

నియోజకవర్గాలు : ఓటర్లు

కోరుట్ల : 11,530

ధర్మపురి : 11,102

జగిత్యాల : 9,759

మహేశ్వరం : 8,362

మానకొండూరు : 7,009

హుజూరాబాద్‌ : 6,931

మేడ్చల్‌ : 7,405

ఇబ్రహీంపట్నం : 7,322

వనపర్తి : 6,382

ఎల్బీనగర్‌ : 6,064

Mane Praveen

Nov 14 2023, 22:21

NLG: ప్రజాస్వామ్య, సామాజిక లౌకిక పోరాడే శక్తులను గెలిపించండి:ఆనంద్

కొండ మల్లేపల్లి: మండల కేంద్రంలో బిజెపి దాని మిత్రులను తిరస్కరించి, లౌకిక ప్రజాస్వామ్య సామాజిక పోరాట శక్తులను బలపర్చాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ పిలుపునిచ్చారు.

మండల కేంద్రంలో పాత బజారు బొడ్డు రాయి కాలనీ పార్టీ శాఖ సమావేశంలో కంబాలపల్లి ఆనంద్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్, ఎంఐఎం ప్రత్యక్షంగా పరోక్షంగా బిజెపి సహకరిస్తున్నాయని అందుకనే మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను అరెస్టు చేయలేదని విమర్శించారు. మోడీకి వ్యతిరేకంగా ఉండే పార్టీపై, సంస్థలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని విమర్శించారు. బిజెపి మత రాయకీయాలను ప్రోత్సహించి, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే, కుల మత తగాధలను రెచ్చగొడుతూ దేశ ఐక్యతను విచ్చినం చేస్తున్న బిజెపి దాని మిత్రులను ఓడించి లౌకిక ప్రజాస్వామ్య సామాజిక పోరాట శక్తులను గెలిపించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి ఎర్ర వెంకటయ్య, సత్యనారాయణ, జయమ్మ, చెన్నమ్మ, తిరుపతమ్మ, మరియమ్మ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Nov 14 2023, 20:02

నల్లగొండ: ఎన్జీ కళాశాలలో ఘనంగా 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల గ్రంథాలయ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో, జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా.. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మరియు ముఖ్య అతిథిగా గోన రెడ్డి కళాశాల గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో పాల్గొని ప్రసంగించారు.

ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్నటువంటి జాతీయ మరియు అంతర్జాతీయ పరిశోధన, దిన పత్రికలు మరియు రిఫరెన్స్ పుస్తకాలు, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ను విద్యార్థులు పోటీ పరీక్షల కోసం వినియోగించుకొని జాతీయస్థాయిలో ఉన్నత విద్యాసంస్థల్లో విద్యని కొనసాగించాలని తెలిపారు.

ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య కన్వీనర్ ఎం.వి. గోన రెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయంలో సాహిత్యం, టెక్నాలజీ కి సంబంధించిన పుస్తకాలు.. మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రల పుస్తకాలు మరియు అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని.. విద్యార్థులు ప్రింటు సమాచారంతో పాటు డిజిటల్ లైబ్రరీ ద్వారా సమాచారాన్ని వినియోగించుకొని కెరీర్లో విజయం సాధించాలని అన్నారు. కళాశాల గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరించారు.

కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. కళాశాల గ్రంథాలయంలో 62 వేలకు పైగా టెక్స్ట్ మరియు రిఫరెన్స్ బుక్స్ అందుబాటులో ఉన్నాయని, కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ సహాయంతో డిజిటల్ లైబ్రరీలో సమాచారాన్ని ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. 

నేడు పుస్తక ప్రదర్శన కార్యక్రమం, ఈ నెల 15న బుక్ రివ్యూ/రీడతన్ కార్యక్రమం, 16న వ్యాసరచన పోటీ యువత గ్రంథాలయాల ఉపయోగం- గ్రంథాలయాలు మరియు వాటి ప్రాధాన్యత, 17న భారత ఎన్నికల వ్యవస్థ పైన వక్తృత్వ పోటీ, 18న వ్యక్తిత్వ వికాస ఉపన్యాసం, 19న జాతీయస్థాయిలో ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్, 20న జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపులో భాగంగా వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు, రిసోర్స్ పర్సన్స్ లకు.. బుక్స్ మరియు సర్టిఫికెట్ లు అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, డాక్టర్ యాదగిరి, డాక్టర్ కృష్ణ కౌండిన్య, లవీందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి, డాక్టర్ వైవిఆర్ ప్రసన్నకుమార్, డాక్టర్ ఎన్ దీపిక, డాక్టర్ వెల్దండి శ్రీధర్, డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ ఎన్ వేణు, డాక్టర్ నారాయణరావు ,చంద్రయ్య , కనకయ్య, మణెమ్మ అసిస్టెంట్ లైబ్రేరియన్, గ్రంథాలయ సిబ్బంది, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పుస్తక ప్రదర్శనలో పాల్గొన్నారు.

Mane Praveen

Nov 14 2023, 09:55

ఈనెల 17 నుండి తెలంగాణలో ఆరు రోజులపాటు రాహుల్ పర్యటన

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. నిత్యం ఎమ్మెల్యే అభ్యర్థులు, వివిధ పార్టీల సీనియర్ నాయకులు తమ అభ్యర్థిని గెలిపించాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాం‍గ్రెస్‌ అగ్రనేత ఎంపీ రాహుల్‌ గాంధీ.. తెలంగాణలో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీ నుండి తెలంగాణలో రాహుల్ పర్యటన ఉండనున్నట్లు సమాచారం.

నవంబర్‌ 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్‌ గాంధీ.. అదే రోజు పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్‌ నిర్వహించే సభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి వరుసగా ఆరు రోజుల పాటు ఆయన సభల్లో పాల్గొననున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్‌ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సమావేశాలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Mane Praveen

Nov 13 2023, 22:51

NLG: సొంత గూటికి చేరిన లెంకలపల్లి సర్పంచ్ పాక నగేష్ యాదవ్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామ సర్పంచి పాక నగేష్.. తన అనుచరులతో కలిసి, ఈ రోజు మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాక అంజయ్య, పెంబళ్ళ సోమయ్య, పెంబళ్ళ మల్లయ్య, అబ్బనబోయిన దశరథ, ఏర్పుల జన్నయ్య, అధిముళ్ల మట్టయ్య, కర్నాటి సైదులు, దాసరి వెంకన్న, పగిళ్ళ రాజశేఖర్, కాటగొని రమేష్, పగిళ్ళ హరీష్, పాక పరమేష్, మేతరి రమేష్, పెంబళ్ళ రవీందర్, దాసరి గణేష్, కొంగల నవీన్,గంట సాయి, ఏర్పుల శేఖర్, కాటం భరత్, ఐతగోని రామ్ చరణ్, కుందారపు సాయి, బన్నీ, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Nov 13 2023, 13:40

TS: నేడు సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ప్రచారం

హైదరాబాద్: నేడు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోమవారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పలు గ్రామాలలో కార్నర్ మీటింగ్ లలో ఆయన పాల్గొంటారు.

రేపు వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్, కామారెడ్డి నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా ఈనెల 15వ తేదీన బోథ్, నిర్మల్ మరియు జనగామ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు.

Mane Praveen

Nov 13 2023, 12:52

NLG: క్రీడాకారులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు

ఈ దీపావళి పండుగ క్రీడాకారుల జీవితాలలో వెలుగులు నింపి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని, పాఠశాల దశ నుండే మంచి క్రమశిక్షణ ,పట్టుదల తో చదువుతూ క్రీడలను అలవాటు చేసుకుంటే అద్భుతమైన జీవితాన్ని సాధించవచ్చునని తెలియజేస్తూ, క్రీడాకారులకు, క్రీడాధికారులకు, ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులకు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులకు, క్రీడా పోషకులకు, క్రీడలను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

Mane Praveen

Nov 13 2023, 10:54

NLG: లెంకలపల్లి లో చల్లమల్ల కృష్ణా రెడ్డి ఎన్నికల ప్రచారం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, బిజేపి మునుగోడు ఎమ్మేల్యే అభ్యర్ధి చల్లమల్ల కృష్ణా రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాటం, డప్పు వాయిద్యాల తో ఆయన కు స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క అవకాశం ఇవ్వండి, మునుగోడు నియోజక వర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తా, లేనట్లయితే మరోసారి ఓటు అడగమని అన్నారు. ప్రజలు కమలం పువ్వు గుర్తు కు ఓటు వేసి తనను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.

Mane Praveen

Nov 12 2023, 19:29

TS: భౌతిక శాస్త్ర అధ్యాపకులు డా. రేఖా వెంకటేశ్వర్లు కు 'గురు స్పందన అవార్డు'

ఖమ్మం: జిల్లా కేంద్రం లో జరిగిన TREND (టీచర్స్ రిలేషన్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్) కార్యక్రమంలో.. నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్రం సహాయ ఆచార్యులు డాక్టర్ రేఖా వెంకటేశ్వర్లు ను "గురు స్పందన "అవార్డు తో సత్కరించారు.

"ఆత్మ హత్యల రహిత భారత నిర్మాణం" లక్ష్యం తో నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలలో వాలంటీర్ గా నేను సైతం అంటూ సేవలు అందిస్తున్నందుకు గాను  "స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్" డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వెంకటేశ్వర్లు ను సత్కరించారు.

డైరెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థులు, యువత, మహిళలు వివిధ కారణాల చేత ఆత్మ హత్య లతో జీవితాలు కోల్పోతున్నారని, వాటిని కూకటి వేళ్లతో సహా నిర్మూలించాలని భావించి, TREND కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులను ఈ ఉద్యమం లో భాగస్వాములు చేస్తూ వారిని గురు స్పందన అవార్డు తో సత్కరిస్తున్నామని తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్ శ్యామ్, సహ అధ్యాపకులు, మిత్రులు శ్రేయోభిలాషులు డాక్టర్ వెంకటేశ్వర్లు కు అభినందనలు తెలిపారు.

SB NEWS TELANGANA